![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -96 లో..... కళ్యాణ్ గురించి వచ్చిన ప్రేమ, ధీరజ్ లకి నిరాశ ఎదురవుతుంది. దంతో ఒక దగ్గర ప్రేమ ధీరజ్ లు ఆగుతారు. తెల్లవారితే నాన్నని పోలీసులు తీసుకొని వెళ్తారు. దీనంతంటికి కారణం నువ్వే నువ్వే కనుక ఆ కళ్యాణ్ గాడితో వెళ్ళిపోకుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు.. మా అమ్మ నా మేనకోడలు ఏం అవుతుందోనని నీ గురించి ఆలోచిందని ధీరజ్ తన ఫ్రస్ట్రేషన్ బయట పెడతాడు.
మరొక వైపు రేపు ఆ రామరాజు ఇంటికి వెళ్ళాలని భాగ్యం అంటుంటే.. వాళ్ళకి మనం ఫైనాన్స్ చేస్తాం. ఆస్తులున్నాయని అబద్ధం చెప్పాము కదా అని తన భర్త అంటాడు. మనకి లాగే వాళ్ళు అబద్దాలు చెప్పరేమో ఎవరికి తెలుసని భాగ్యం అంటుంది. ధీరజ్ ప్రొద్దున లేచేసరికి ప్రేమ కన్పించదు. దాంతో ధీరజ్ కంగారుగా వెతుకుతాడు. ఇక భద్రవతి సీఐకి ఫోన్ చేసి గడువు పూర్తయింది కదా వచ్చి రామరాజుని తీసుకొని వెళ్ళండి అని చెప్తుంది. మరొకవైపు ధీరజ్ చేసిన తప్పు వళ్ల ఈ రోజు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి వచ్చింది. వాడిని చిన్నప్పటి నుండి భయంలో ఉంచితే బాగుండు .. నగలని తీసుకొని రాకుంటే నన్ను పోలీసులు తీసుకొని వెళ్తారని తెలుసు.. అయినా వాడు ఇంకా ఇంటికి రాలేదంటే అర్ధమేంటి.. అరెస్ట్ చేస్తే నాకేంటి అనేగా అని రామారాజు అంటాడు.
అప్పుడే రామరాజుకి భాగ్యం ఫోన్ చేస్తుంది.. మేమ్ వస్తున్నామని భాగ్యం అనగానే వద్దు తర్వాత ఎప్పుడైనా రండి అని రామరాజు ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి నిన్న రమ్మని చెప్పారు. ఇవ్వాళ్ల వద్దని అంటున్నారు. వీళ్ళపై ఏదో డౌట్ ఉంది.. వెళ్లి వాళ్ల రైస్ మిల్ ఆస్తులు చూసి వస్తానని భాగ్యం బయల్దేరుతుంది.రామరాజు ఇంటికి పోలీసులు వస్తారు. పై నుండి భద్రవతి వాళ్ళు చూస్తుంటారు.రామరాజు బయటకు వస్తుంటే అందరు ఆపుతారు. ఇది నా చిన్న కొడుకు నాకు ఇచ్చిన బహుమానమని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |